Site icon NTV Telugu

Pawan Kalyan: ‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. రచ్చరేపుతున్న పవన్‌కళ్యాణ్‌ పోస్టర్‌.

Ustad Pawankalyan

Ustad Pawankalyan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మైత్రి మూవీస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు మ‌రో కొత్త సినిమాను మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. రీసెంట్ టైమ్‌లో సుజీత్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో సినిమా ఉంటుంద‌ని ఓ వారం రోజులుగా న్యూస్ బ‌య‌ట చ‌క్కర్లు కొడుతుంది. ఈ నేప‌థ్యంలో హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో ప‌వ‌న్ చేస్తున్న సినిమాకు సంబంధించి అధికారిక ప్రక‌ట‌న వెలువ‌డింది. ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ – హ‌రీష్ శంక‌ర్ మూవీ తెర‌కెక్కనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌నుంది. దర్శకుడు హరీశ్ శంకర్-పవన్ కాంబినేషన్లో రానున్న సినిమాకు ‘ఉస్తాద్ భగత్సింగ్’ అనే టైటిల్ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్ ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే క్యాప్షన్ ఇచ్చి, పవన్ బైక్ పట్టుకున్న లుక్ను రిలీజ్ చేసింది. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా.. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. ఆదివారం టైటిల్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్ లుక్ పోస్టర్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ బైక్ పై చేతిలో టీ గ్లాస్ తో నిల్చుని కనిపిస్తున్నాడు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్ ఉంది. బైక్‌ పై చేయిపెట్టి స్టైల్ గా పవన్‌ నిలబడి ఓరేంజ్‌ లో చూస్తున్న లుక్‌ అదిరిపోయింది. పవన్‌ వెనుక ఉరుములులతో వున్న పవన్‌కు పవర్‌ లుక్ అదుర్స్‌ అంటున్నారు నెటిజన్స్‌.

Read also: Suicide in Public Toilet: పబ్లిక్ టాయిలెట్‌లో మహిళ ఆత్మహత్య..!

అయితే… త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే రెండు సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. ఒకటి సుజీత్ దర్శకత్వం వహించిన సినిమా. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో రెండో సినిమా ఫిక్స్ అయింది. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా? దీంతో అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది. ఎందుకంటే ఇప్పటికీ ఇద్దరూ కలిసి భవదీయుడు భగత్‌సింగ్‌ సినిమాను ప్రకటించారు. సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. మరోవైపు తమిళ చిత్రం థెరి రీమేక్‌లో పవన్ నటించనున్నాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెరి రీమేక్ అవసరం లేదంటూ సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ పెద్ద రచ్చ చేశారు. ఇదంతా పవన్ కళ్యాణ్, హరీష్ ల సినిమాలపై అందరిలో ఆసక్తిని పెంచింది. దీంతో పాటు ఈ సినిమాపై జోరుగా వార్తలు మొదలయ్యాయి.అయితే ఈ వార్తలన్నింటికీ సమాధానం ఇస్తూ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయబోతున్నట్లు హరీష్ ప్రకటించారు. త్వరలో పవన్ మరో కొత్త సినిమా ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అభిమానుల్లో, సినీ అభిమానుల్లోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Exit mobile version