టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి చేతులు కలపబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాను రిపీట్ చేస్తూ, మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నిర్మాత దిల్ రాజు ఇటీవలే పవన్ కళ్యాణ్ డేట్స్ ను ఖరారు చేసుకున్నారు.
Also Read : Team India Squad: రోహిత్ శర్మ, విరాట్ సహా ఆస్ట్రేలియాతో తలపడేది వీళ్ళే!
‘వకీల్ సాబ్’ మాదిరిగానే, బలమైన సోషల్ మెసేజ్ తో పాటు, పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ కు, ఆయన అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ఈ సినిమాను రూపొందించాలని ఆయన భావిస్తున్నారు. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటూనే, కథలో ఒక సందేశం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు ప్రస్తుతం సరైన కథ, దర్శకుడి కోసం అన్వేషణలో ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. దిల్ రాజు సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ వార్త తెలియగానే పవర్ స్టార్ అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ‘వకీల్ సాబ్’ వంటి మరొక పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ను తమ అభిమాన నటుడి నుంచి ఆశిస్తున్నారు.
