Site icon NTV Telugu

Avatar VFX: ‘అవతార్’ను నడిపింది తెలుగమ్మాయే.. ఇదే బ్యాక్ గ్రౌండ్!

Pavani Rao Avathar

Pavani Rao Avathar

ప్రపంచ సినీ చరిత్రలో ‘అవతార్’ ఒక విజువల్ వండర్. జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఆ పండోరా ప్రపంచం, నీలం రంగు మనుషులు, వింత జీవులు ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్తాయి. అయితే, ఈ అద్భుత దృశ్యకావ్యం వెనుక ఒక తెలుగు మహిళ మేధస్సు, కష్టం ఉన్నాయనే విషయం మనందరికీ గర్వకారణం. ఆమే పావనీ రావు బొడ్డపాటి. హాలీవుడ్ టాప్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ‘వెటా ఎఫ్ఎక్స్’ (Weta FX) లో సీనియర్ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్‌గా ఆమె కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలుగు మూలాలు ఉన్న పావనీ రావు పుట్టి పెరిగింది ఢిల్లీలో. ఆమె కళాహృదయానికి పునాది వాళ్ల నానమ్మే. ఆమె ఒక ఆర్టిస్ట్ కావడం, ఎప్పుడూ బొమ్మలు వేస్తూ ఉండటం చూసి పావని కూడా అటువైపు ఆకర్షితురాలయ్యారు.

Also Read :Sree Leela : చేతులెత్తి దండం పెడుతున్నా.. అసభ్యకర కంటెంట్’పై శ్రీలీల ఎమోషనల్

ఢిల్లీలోని ‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్’ నుండి ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె, తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలోని ‘అకాడమీ ఆఫ్ ఆర్ట్ యూనివర్సిటీ’ నుండి యానిమేషన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్‌లో మాస్టర్స్ (MFA) సాధించారు. 2009లో వచ్చిన మొదటి ‘అవతార్’ సినిమా కోసం ఆమె ‘లైటింగ్ టీడీ’గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అప్పటి నుండి పండోరా ప్రపంచమే ఆమెకు ఇల్లుగా మారిపోయింది. 2022లో విడుదలైన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ సినిమాలో మనల్ని మంత్రముగ్ధులను చేసిన సీన్ల వెనుక పావనీ టీమ్ శ్రమ ఎంతో ఉంది. ఈ సినిమా కోసం ఆమె నేతృత్వంలోని టీమ్ ఏకంగా 3000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్‌ను రూపొందించింది. నీటి లోపల ఉండే జీవులు, నీటి అలల కదలికలను అత్యంత సహజంగా చూపించడం చాలా కష్టమైన ప్రక్రియ. పావనీ రావు తన టీమ్‌ను ముందుండి నడిపిస్తూ వీటికి ప్రాణం పోశారు.

Also Read :Vijay Deverakonda: రౌడీ స్టార్‌తో రోమాన్స్‌కు రడీ అవుతున్న బ్యూటీ.. ఎవరో తెలుసా!

ప్రస్తుతం విడుదల కాబోతున్న ‘అవతార్ 3’ (ఫైర్ అండ్ యాష్) లో కూడా ఆమె తన మార్క్ చూపించబోతున్నారు. ఈసారి సినిమా అగ్ని (Fire) మరియు బూడిద (Ash) నేపథ్యంలో సాగుతుంది. దీనికి సంబంధించి సరికొత్త వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను పావనీ రావు సిద్ధం చేశారు. కేవలం అవతార్ మాత్రమే కాదు, ‘ది హాబిట్’ ట్రిలోజీ, ‘మేజ్ రన్నర్’ వంటి గ్లోబల్ హిట్స్ కోసం కూడా ఆమె పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతి రంగంలోనూ సత్తా చాటుతున్నారు. అందులోనూ హాలీవుడ్ అత్యున్నత స్థాయి సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ వంటి అత్యంత క్లిష్టమైన విభాగాన్ని ఒక తెలుగు మహిళ లీడ్ చేయడం సాధారణ విషయం కాదు. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో నివసిస్తూ, తన సృజనాత్మకతతో ప్రపంచ సినిమాను ఏలుతున్నారు. జేమ్స్ కామెరూన్ లాంటి దిగ్గజ దర్శకుడి విజన్ ను వెండితెరపై నిజం చేయడంలో పావనీ రావు చూపిస్తున్న ప్రతిభ ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. రాబోయే ‘అవతార్ 3’ లో ఆమె సృష్టించిన విజువల్స్ మరెన్ని రికార్డులను తిరగరాస్తాయో వేచి చూడాలి.

Exit mobile version