హైదరాబద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ రోజు ఉదయం తొమ్మిదింటికి హైదరాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం టేక్ ఆఫ్ కాకపోవడంతో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. విమానంలో సినీ సెలబ్రిటీలు పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో హీరో విజయ్ దేవరకొండ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ విమానంలో ప్రయాణించవలసి ఉంది. రూ. 30 వేలు పెట్టి టికెట్ కొని ఇప్పటివరకు విమానం టేక్ అప్ కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్జెట్ విమానం సాంకేతిక సమస్య కారణంగా టెక్ ఆఫ్ తీసుకోలేదు. అయితే ఏదైనా సమస్య ఉంటె ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని అలా కాకుండా కనీసం సమాచారం లేకుండా గంటల తరబడి ఎదురుచేపించడం ఏంటని స్పైస్ జెట్ యాజమాన్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా విజయ్ దేవరకొండ తన కుటుంబం తో కలిసి కుంభమేళా వెళ్లేందుకు ఉదయం ఎయిర్పోర్ట్ కు చేరుకొని విమానం టెక్ ఆఫ్ కోసం ఎదురుచూసున్నాడు.
RGIA : శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
![Rgia](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2025/02/rgia-1024x576.jpg)
Rgia