భాషతో సంబంధం లేకుండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పరేశ్ రావల్.. ప్రజంట్ అక్షయ్ కుమార్, టాబూ కలిసి నటిస్తున్న ‘భూత్ బంగ్లా’ అనే హారర్ కామిడీ చిత్రంలో నటిస్తూ. అలాగే అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి కలిసి తీస్తున్న ‘హీరా పేరీ-3’లోనూ పరేశ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే తాజాగా తనకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి తన అభిమానులతో పంచుకున్నాడు పరేశ్ రావల్..
Also Read : Chiranjeevi : ‘ఠాగూర్’ మూవీ జోడి రిపీట్ చేస్తున్న అనిల్ రావిపుడి..!
‘నాకు రాజ్‌కుమార్ సంతోషి తీసిన ‘ఘాతక్’ చిత్రం షూటింగ్ సమయంలో కాలికి గాయం అయ్యింది. ముంబైలోని ఓ ప్రేవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. నా పరిస్థితి చూసి ఇక నా కెరీర్ ముగిసిపోతుంది అని భయపడిపోయాను. కానీ నటుడు అజయ్ దేవగన్ తండ్రి, యాక్షన్ డైరెక్టర్ వీరూ దేవన్ నాకు ఓ సలహా ఇచ్చాడు. ఆస్పత్రికి విజిట్ చేసిన వీరూ దేవగన్.. త్వరగా గాయం నుంచి కోలుకోవాలంటే ఉదయం నీ స్వంత మూత్రాన్ని తాగాలని సలహా ఇచ్చాడు.. ఫైటర్లు అందరూ ఇదే చేస్తారని, ఇలా చేస్తే ఎటువంటి సమస్య ఉండదని, మద్యం కానీ, మటన్ కానీ, పొగ త్రాగడం కానీ చేయవద్దు తెలిపాడు. అతను చెప్పినట్లుగానే యధావిధిగా ప్రతి రోజు చేశా. 15 రోజుల్లో గాయం నయమైందని, ఎక్స్ రే రిపోర్టులను డాక్టర్లు చూసి ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఆ గాయం తగ్గాలంటే రెండు నుంచి రెండున్నర నెలల సమయం పడుతుందని. కానీ నెలన్నర రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నట్లుగా డాక్టర్‌లు తెలిపారు’ అంటూ పరేశ్ రావల్ తెలిపాడు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
