Site icon NTV Telugu

రిషీ కపూర్ స్థానంలో పరేశ్ రావల్…

కరోనా కారణంగా ఎన్నో సినిమాలు ఆలస్యమయ్యాయి. లాక్ డౌన్స్ పదే పదే షూటింగ్స్ ని ఆపేశాయి. అయితే, ‘శర్మాజీ నమ్కీన్’ ఈ మధ్య కాలంలో డిలే అయిన మూవీస్ లో చాలా స్పెషల్. హితేశ్ భాటియా దర్శకత్వంలో రూపొందుతోన్న ఎంటర్టైనర్ రిషీ కపూర్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, పోయిన సంవత్సరం కరోనా ఫస్ట్ లాక్ డౌన్ కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తరువాత లాక్ డౌన్ కాలంలోనే రిషీ కపూర్ క్యాన్సర్ తో మరణించాడు. ఆయన మృతితో మరింత ఆలస్యమైంది ‘శర్మాజీ నమ్కీన్’ సినిమా.
2021 ప్రారంభంలో ‘శర్మాజీ’ మూవీ దర్శకనిర్మాతలు రిషీ కపూర్ పాత్రలోకి పరేశ్ రావల్ ని తీసుకొచ్చారు! కథలో మార్పుచేర్పుల తరువాత రిషీ కనిపించే స్థానంలో పరేశ్ ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేశారు. అయితే, మార్చ్ లో పరేశ్ రావల్ ‘శర్మాజీ’ మూవీ కోసం షూటింగ్ ప్రారంభించినప్పటికీ రెండో లాక్ డౌన్ అడ్డంకిగా మారింది. ముంబైలో మహమ్మారి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇంత కాలం సినిమా నిలిపివేశారు. అయితే, మిగతా అన్ని చిత్రాల్లాగే ‘శర్మాజీ నమ్కీన్’ కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. వారం రోజుల పాటూ పరేశ్ రావల్ తో చిత్రీకరణ జరిపి షూటింగ్ పూర్తి చేస్తారట. తరువాత చకచకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసి సెప్టెంటర్ నాలుగున రిషీ కపూర్ జయంతి సందర్భంగా థియేటర్స్ కు తీసుకురానున్నారు!
‘శర్మాజీ నమ్కీన్’ ఓ అరవై ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి కథ. లేటు వయసులో ఆయనకు ఎదురయ్యే సరికొత్త అనుభవాల సమాహారం. చూడాలి మరి, రిషీ కపూర్ చివరి చిత్రం, ఆయన పాత్రలోకి పరేశ్ రావల్ పరకాయ ప్రవేశం… ప్రేక్షకులకి ఎంత వరకూ నచ్చుతాయో…

Exit mobile version