Site icon NTV Telugu

NANI : ‘ప్యారడైజ్’ కష్టాలు తీరినట్టే.. షూట్ స్టార్ట్ ఎప్పుడంటే.?

Paradise

Paradise

నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్-3’ సీక్వెల్ మరో రెండు రోజులలో థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా షూట్ ను స్టార్ట్ చేయనున్నాడు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ది ప్యారడైజ్ ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

Also Read : Padma Awards : బాలయ్య, అజిత్ కుమార్ కు పవర్ స్టార్ శుభాకాంక్షలు

కాగా ఇటీవల ఈ సినిమా బడ్జెట్ లేక ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్యారడైజ్ గ్లిమ్స్ కు వచ్చిన సూపర్బ్ రెస్పాన్స్ తో  ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ రేట్ కోట్ చేయగా ఇంకా ఎక్కువ ఆశించిన మేకర్స్ మరో ఓటీటీ సంస్థను కూడా సంప్రదించడంతో అక్కడ బేరం తెగలేదని టాక్. తీరా ముందుగా వచ్చిన ఓటీటీ సంస్థ కోట్ చేసిన రేట్ తగ్గించడంతో కంగుతిన్న మేకర్స్ మొత్తానికి కిందా మీదా పడి మంచి ధరకే డీల్ క్లోజ్ చేసాడని సమాచారం. అన్ని అడ్డకుంలు దాటి ప్యారడైజ్ మే 2 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. చైల్డ్ ఎపిసోడ్ కు సంబందించి సీన్స్ ను తెరకెక్కించబోతున్నారు. హిట్ 3 ప్రమోషన్స్ ముగించి ఓ వారం ఆల‌స్యంగా ఈ షూటింగ్ లో నాని జాయిన్ అవనున్నాడని యూనిట్ టాక్. ఈ సినిమా బాలీవుడ్ విల‌న్‌ ను దించుతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. గతేడాది బాలీవుడ్ లో వచ్చిన సూప‌ర్ హిట్ చిత్రం ‘కిల్‌’లో విలన్ గా నటించిన రాఘ‌వ్ జుయ‌ల్ ని ప్యారడైజ్ కోసం తీసుకున్నారని బజ్ నడుస్తోంది.

Exit mobile version