P.Susheela: ప్రముఖ గాయని పి.సుశీలకు అస్వస్థత..
- ప్రముఖ గాయని పి. సుశీలకు అస్వస్థత
- చెన్నైలోని ఆళ్వార్ పేటలోని కావేరీ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స
- ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ గాయని, పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం పి. సుశీల వయసు 86 సంవత్సరాలు. వయో భారంతో పాటు గత కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు పి సుశీల. శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. చెన్నై కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం సుశీల కడుపునొప్పితో భాదపడుతున్నారని, అయితే అది సాధారణ కడుపు నొప్పెనని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపాయి. సుశీల ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన చెందొద్దని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆమె త్వరగా కోలుకుని తిరిగి రావాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆమె సన్నిహితులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.
కాగా పి సుశీల పూర్తి పేరు పులపాక సుశీల. విజయనగరంలో 1935 నవంబరు 13న పి.ముకుందరావు, శేషావతారం దంపతులకు జన్మించారు. సుశీల 1950 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో నేపథ్య గాయకురాలిగా కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగ, సింహళ భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడారు . ఆమె మాతృభాష తెలుగు అయినప్పటికీ కొద్దిగా హిందీ, కన్నడ భాషలలో మాట్లాడగలరు. తమిళ భాషను తెలుగు మాట్లాడినంత సరళంగా మాట్లాడగలరు. పి. సుశీల సంగీత ప్రపంచానికి అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఉత్తమ గాయనిగా ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు పి. సుశీల.
Also Read
తాజావార్తలు
-
IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
-
Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
-
Peddi Pre-Release Event : ‘పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో
-
Mamata Banerjee: “ఇక మేమేంటో చూపిస్తాం”.. అల్లుడు అభిషేక్‌పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
-
LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..