Site icon NTV Telugu

Keeravani : ఆస్కార్ విజేత కీరవాణి మ్యూజికల్ కాన్సర్ట్.. ట్రైలర్ రిలీజ్

February 7 2025 02 18t132925.404

February 7 2025 02 18t132925.404

ప్రజంట్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్‌లకు మధ్య పోటి పెరిగిపోయింది. దీంతో సీనియర్ సంగీత దర్శకులకు అవకాశాలు రావడం కష్టం అయ్యింది. ఇప్పుడు అంతా దేవీ, థమన్, అనిరుధ్ చుట్టూ తిరుగుతున్నారు. అలా ఇప్పుడున్న పోటీలో ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా సైలెంట్ అయిపోయారు. అడపా దడపా తప్పితే వాళ్ల పాటలు కూడా వినిపించడం లేదు. కానీ కీరవాణిని చూస్తుంటే ఇది తప్పనిపిస్తుంది.. ఆయన టైమ్ మళ్లీ స్టార్ట్ అయింది. ‘RRR’ మూవీతో ఆస్కార్ విజేతగా నిలిచిన సంగీత దర్శకుడు ఎం. ఎం.కీరవాణి ఇప్పటికి అంతే ఫామ్ లో ఉన్నాడు. అందుకే ముందు నుంచి కూడా రాజమౌళి తన ప్రతి ఒక సినిమాకు ఆయనే ఎంచుకుంటాడు. అందులో పాటలు ఎలా ఉన్నా.. ఆర్ ఆర్ మాత్రం అదిరిపోతుంది. కేవలం తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తోనే సినిమా స్థాయి పెంచేస్తుంటారు కీరవాణి.

Also Read:Chhaava: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘చావా’..

అందుకే ఎంత పెద్ద సినిమా తీసిన.. జక్కన్న మరో మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూడరు. ఇక తాజాగా కీరవాణి మ్యూజికల్ కాన్సర్ట్ కు సర్వం సిద్ధం అయింది. హైదరాబాద్ టాకీస్, మై మ్యూజిక్ మై కంట్రీ సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. మార్చి 22న హైటెక్స్‌లో ఇది జరగనుంది. తాజాగా దీని ట్రైలర్ విడుదల చేశారు. ఆస్కార్ తర్వాత కీరవాణి నిర్వహిస్తున్న కాన్సర్ట్ ఇదే కావడం విశేషం.

 

Exit mobile version