Site icon NTV Telugu

Operation Sankalp: MAAతో కలిసి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ‘ఆపరేషన్ సంకల్ప్’

Maa

Maa

తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) సహకారంతో ‘ఆపరేషన్ సంకల్ప్’ అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB), మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ , మరియు సివిల్ ఫోర్స్ ట్రస్ట్ భాగస్వామ్యంతో చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘ఆపరేషన్ సంకల్ప్’ అధికారికంగా ప్రారంభించబడింది.

Also Read:Konda Vishweshwar Reddy: నేను బీఆర్ఎస్ పార్టీని వీడడానికి కారణం అదే!

ఈ ముఖ్యమైన కార్యక్రమానికి TGANB డైరెక్టర్ శ్రీ సందీప్ షాండిల్యా గారు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాదాల రవి గారు, TGANB ఎస్పీ శ్రీ పి. సీతారామ, మరియు డిపార్ట్‌మెంట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ (DEPWD) డైరెక్టర్ శ్రీమతి శైలజ గారు వంటి ప్రముఖులు హాజరు అయ్యారు. డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే మా లక్ష్యం దిశగా ఇది ఒక శక్తివంతమైన అడుగు అని ఆపరేషన్ సంకల్ప్ టీం చెబుతోంది.

Exit mobile version