Site icon NTV Telugu

Om Shivam: మూడు భాషల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న ‘ఓం శివం’

Om Shivam

Om Shivam

“Om Shivam” Film has completed its shooting: ఈమధ్య దేవుళ్ళ చుట్టూ తిరుగుతోంది టాలీవుడ్. సినిమాలో డివోషనల్ కంటెంట్ ఉంటే ప్రేక్షకుల ద్రుష్టి సినిమా మీద పడుతోంది. ఈ క్రమంలోనే ఓం శివం అనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. దీపా మూవీస్ బ్యానర్ పై భార్గవ కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ” ఓం శివం” సినిమాకి కె.ఎన్. కృష్ణ కనకపుర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఆల్విన్ దర్శకుడు కాగా విరానిక శెట్టి కథానాయిక. వైరాగ్యంలో వున్న ఓ శివ భక్తుడి జీవితంలో జరిగే కొన్ని అనూహ్య సంఘటనలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి మలచిన చిత్రం “ఓం శివం” అని సినిమా యూనిట్ తెలిపింది.

Vishnu Priya: రీతూ జీవితంలోకి వచ్చాక పొట్ట పెరిగింది.. విష్ణు ప్రియా ఆసక్తికర వ్యాఖ్యలు

ఈస్ట్ గోదావరి,,మాండ్య, పుదుచ్చేరి, తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని దర్శకుడు ఆల్విన్ తెలిపారు. భార్గవ కృష్ణకి ఇది మొదటి సినిమా అయినా చాలా బాగా శివ కేరక్టర్ కి పండించాడు, అలాగే కథ,సంగీతం, కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని దర్శకుడు అన్నారు. కథ వినగానే అన్ని భాషలలో చేద్దాం అని దర్శకుడికి చెప్పగానే ప్లానింగ్ ప్రకారం బడ్జెట్ వృధా చేయకుండా చాలా బాగా చేశారు. ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా మూడు భాషల పాటలను త్వరలో విడుదల చేయడానికి, మరో రెండు నెలల్లో ఒకేరోజు మూడు భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.రవి కాలే, ఉగ్రం రవి, అపూర్వ శ్రీ, , రోబో గణేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం :విజయ్ యార్డ్లి అందిస్తున్నారు.

Exit mobile version