టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ మరోసారి నటుడిగా లీడ్ రోల్‌లో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. జనవరి 23న రిపబ్లిక్ డే వీకెండ్‌లో సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ టీజర్‌లోని కథ, అహంకారం, స్వార్థపూరిత స్వభావం గల ధనవంతుడైన చేపల వ్యాపారి అంబటి ఓంకార్ నాయుడు చుట్టూ తిరుగుతుంది. తరుణ్ భాస్కర్ ఆ పాత్రలో తన నటనతో కట్టిపడేశారు. ముఖ్యంగా ఐపీఎల్ సంభాషణ తన పాత్రను హైలైట్ చేసే హ్యూమరస్ బిట్‌గా నిలుస్తుంది. హీరోకు భిన్నంగా, ఓర్పు, సర్దుబాటును కలిగి ఉన్న మంచి, క్రమశిక్షణ కలిగిన కొండవీటి ప్రశాంతి(ఈషా రెబ్బ)ని అతను వివాహం చేసుకుంటాడు.
Also Read:Tharun Bhascker: హర్టయిన జర్నలిస్ట్.. లైవ్లో తరుణ్ భాస్కర్ క్షమాపణలు
ఇక ఈషా రెబ్బా తన పాత్రలో ఆకట్టుకుంది. వారి విభిన్న వ్యక్తిత్వాలు ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాకి వేదికగా నిలిచాయి. టీజర్ సూచించినట్లుగా, ఈ కుటుంబ కథా చిత్రంలో ఒక ఊహించని మలుపు ఉంది. దర్శకుడు ఏ ఆర్ సజీవ్ ఈ చిత్రాన్ని భిన్నమైన, నవ్వించే మూమెంట్స్ నిండిన ఆరోగ్యకరమైన ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. రైటింగ్, కథనం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ దీపక్ యెరగర గోదావరి జిల్లాల అందాన్ని ఆకట్టుకునే, కంటికి ఆహ్లాదకరమైన ఫ్రేమ్‌లతో అద్భుతంగా చూపించారు. జే క్రిష్ అందించిన సంగీతం, ముఖ్యంగా ఉల్లాసమైన థీమ్ ట్రాక్ ఆకట్టుకుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. వినోదంతో కూడిన ఈ ప్రామెసింగ్ టీజర్ తర్వాత, లాంగ్ వీకెండ్‌ను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో సినిమాను జనవరి 23న రిపబ్లిక్ డే వీకెండ్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
