NTV Telugu Site icon

ఆదిపురుష్ : ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన మేకర్స్…!

Om Raut reveals interesting updates on Prabhas’ Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ పై అప్డేట్ గురించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రంలో రాముడి పాత్రలో కనిపించనున్నాడు. కృతి సనన్ సీత పాత్ర, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలు పోషిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నాడు. తాజాగా దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ గురించి ఆసక్తికరమైన అప్డేట్ ను ఇచ్చారు. దాదాపు 30 శాతం ‘ఆదిపురుష్’ షూట్ పూర్తయిందని, సినిమాలోని ప్రధాన పాత్రధారులు గత సంవత్సరం ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీని పూర్తి చేశారని ఆయన చెప్పారు. ఈ చిత్రం కోసం ప్రభాస్, సైఫ్ అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ లోకి చేంజ్ అయ్యారు. ఇక కృతితో పని చేయడం గొప్ప అనుభవం అంటూ టీంపై ప్రసందాలు కురిపించారు దర్శకుడు ఓం రౌత్.