Site icon NTV Telugu

Suhas: ‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్.. ఇదేదో గట్టిగా కొట్టేలానే ఉందే!

Oh Bhama

Oh Bhama

సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్‌ రిలీజ్‌ కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్‌. ట్రైలర్‌ను గమనిస్తే.. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌, హీరో, హీరోయిన్స్‌ ఎనర్జీ, ఇలా ఈతరం ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారిని అలరించే ఫుల్‌ ప్యాకేజీగా ఈ చిత్రాన్ని రూపొందించారని అర్థమవుతోంది.

Also Read:Kollywood : ఆయన సినిమాలో నటించేందుకు బాలీవుడ్ హీరోల రిక్వెస్ట్

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ప్రతి ప్రమోషన్‌ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఓ క్వాలిటీ సినిమాను ప్రేక్షకులకు ఇవ్వడానికి ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మాత హరీష్‌ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించాడు. ప్రొడక్ట్‌ క్వాలిటీగా రావడానికి ఆయనే కారణం. మణికందన్‌ ఫోటోగ్రఫీతో ఈ సినిమాను చాలా కలర్‌ఫుల్‌గా మలిచాడు.రథన్‌ ఈ లవ్‌స్టోరీకి చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో ఉన్న ఆరుపాటలు వేటికవే అనే విధంగా బ్యూటిఫుల్‌గా ఉంటాయి అన్నారు. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. మణికందన్‌ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి రథన్‌ సంగీతాన్నిసమాకూరుస్తున్నాడు. బ్రహ్మా కడలి ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.

Exit mobile version