NTV Telugu Site icon

OG : ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ షూట్ లో అడుగుపెట్టేది ఎప్పుడంటే..

Og

Og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. గడచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ మరో సారి మేకప్ వేసుకోబోతున్నారు. ఎన్నికల కారణంగా వాయిదా వేసిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజి (OG ),  ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ లో పవర్ స్టార్ అడుగుటపెట్టబోతున్నాడు.

Also Read : Rajinikanth : అందరికీ అందుబాటులో ‘వేట్టయన్ – ద హంట‌ర్‌’ టికెట్ రేట్లు

వీటిలో హరిహర వీరమల్లు షూటింగ్  విజయవాడలో ఏర్పాటు చేసిన సెట్స్ లో ఇటీవల కొంత భాగం షూట్ చేశారు. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరి చూపు OG పైనే ఉంది. ఈ సినిమాను తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాలో పవర్ స్టార్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం నుండి ఆసక్తిక అప్ డేట్ తెలిసింది. OG షూటింగ్ మళ్ళి స్టార్ట్ అయింది, ప్రస్తుతం ఈ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. నైట్ సీన్స్ షూట్ చేస్తున్నాడు దర్శకుడు సుజీత్ . కానీ పవర్ స్టార్ లేని సీన్స్ మాత్రమే షూట్ చేస్తున్నారు. ఆయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రెండు లేదా మూడు రోజల తర్వాతఈ షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. అటు రాజకియాలు, ఇటు సినిమా షూటింగ్స్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రియల్ పవర్ స్టార్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్