ఈ ఏడాది సుమ్మర్ లో స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయకుండా వృధా చేసారు. ఇప్పుడేమో ఒకేసారి ఇద్దరు వచ్చేందుకు పోటీ పడుతున్నారు. అలా ఈ ఏడాది సెప్టెంబర్ రేస్ లో నువ్వా నేనా అని రీతిలో బాలయ్య -బోయపాటి అఖండ 2, OG సినిమాలు పోటీ పడుతున్నాయి. వారిని సినిమా పోస్ట్ పోన్ అని వీళ్లు.. వాళ్ళ సినిమా పోస్ట్ పోన్ అని వీళ్లు లేని దాన్ని పట్టుకుని వాదులాడుకుంటున్నారు.
Also Read : The RajaSaab : బాబోయ్.. భారీ ధర పలుకుతున్న రాజాసాబ్ నాన్ థియేట్రికల్ రైట్స్
అయితే నిన్న ఉన్నట్టుండి బాలయ్య – బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2 పోస్ట్ పోన్ అని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. అఖండ 2 షూటింగ్ అవలేదని 11 రోజుల మేజర్ షెడ్యూల్ పూర్తి చేయాలని, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా టైమ్ పడుతుంది. అలాగే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించనుంది. నేపథ్యంలోనే అఖండ 2 డిసెంబరు కి పోస్ట్ పొన్ అని ఫీలర్లు వదిలారు. ఈ విషయమై మేకర్స్ ను ఆరాతీయగా ఒక పాట మినహా ‘అఖండ 2’ షూటింగ్ మొత్తం పూర్తి అయింది. మరోవైపు డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 15 నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేస్తాం. సెప్టెంబరు 1 నాటికి ఓవర్సీస్ కాపీ కూడా రెడీ అవుతుంది. మేము ముందుగా చెప్పినట్టే సెప్టెంబరు 25న అఖండ 2 రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక మరోవైపు అన్ని పనులు పూర్తి చేసుకుని సెప్టెంబరు 25 రిలీజ్ కు OG కూడా విడుదల కాబోతుంది. ఇద్దరు సెప్టెంబర్ రావడం పక్క కాకుంటే ఒకే రోజు వస్తే రెండు సినిమాలు ఎంతో కొంత నష్టపోతాయి. సో ఒక రోజు గ్యాప్ తో మరో సినిమా రిలీజ్ అయ్యలా చేసే ఆలోచన చేస్తున్నారు. మరి వీరిలో ఎవరు ముందు వస్తారో ఎవరు వెనక వస్తారో చూడాలి.
