Site icon NTV Telugu

OG : రప్పా బప్పా..ఓజీ ఫస్ట్ సాంగ్ అదిరిందిగా

Og

Og

టాలీవుడ్ హీరో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘ఓజీ’ కోసం ఫాన్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ‘సాహో’ ఫేం సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. జపాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండ‌గా ఇప్ప‌టికే వ‌చ్చిన‌ ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ అభిమానులలో అంచనాలు పెంచాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి పవర్‌ఫుల్‌ సాంగ్ ఓజీ ఫైర్ స్ట్రోమ్ ని విడుద‌ల చేశారు మేక‌ర్స్. థ‌మ‌న్ సంగీతం అందించిన ఈ పాట‌కు థమన్ ఎస్ , నజీరుద్దీన్ & భరతరాజ్ , సిలంబరసన్ టిఆర్ (శింబు) , దీపక్ బ్లూ, రాజా కుమారి క‌లిసి పాడారు.

Also Read: Anasuya : చెప్పు తెగుద్ది.. అంటూ బోల్డ్ కామెంట్లపై అనసూయ స్ట్రాంగ్ రియాక్షన్

ఈ పాట గురించి చెప్పాలంటే తమన్ మార్క్ తో బాగుంది. ఫీల్ ది ఫైర్ అంటూ సాగుతున్న ఈ పాట పవర్​ఫుల్​గా ఉంది. తమన్ అందించిన మ్యూజిక్ పాటను మరో లెవెల్​కు తీసుకువెళ్లేలా ఉంది. తమన్ చెప్పినట్లుగానే ఈ పాటలో బ్యాక్​గ్రౌండ్ స్కోర్​తో అదరగొట్టారు. ఈ ఒక్క పాటతో సినిమాపై హైప్ మరో లెవెల్​కు వెళ్లిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా చేసింది. సుజిత్ దర్శకుడు కాగా.. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సెప్టెంబర్ 25న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

Exit mobile version