Site icon NTV Telugu

OG Collections: ఓజీ ఫస్ట్ డే ఊహించని విధ్వంసం!

Og Movie

Og Movie

ఓజీ సినిమాను ఒక పవన్ అభిమాని ఎలా అయితే ఊహించుకున్నాడో.. అదే రేంజ్‌లో ప్యూర్ ఫ్యాన్ బాయ్ సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు సుజీత్. ఆయన పవర్ స్టార్‌కు ఇచ్చిన ఎలివేషన్‌కు పండగ చేసుకుంటోంది పవన్ ఆర్మీ. పవన్ కనిపించిన ప్రతిసారీ థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు బాక్సులు బద్దలవుతున్నాయి. మొత్తంగా.. ఓజీ సినిమా పవన్ ఫ్యాన్స్‌కు ఒక ఫుల్ మీల్స్ పెట్టేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఓజీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోలతోనే అదరగొట్టిన ఓజీ మూవీ.. తొలి రోజు వరల్డ్ వైడ్‌గా భారీ ఓపెనింగ్స్ అందుకుంది.

Also Read:Perni Nani: బాలయ్యపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

ఇండియాలో పెయిడ్ ప్రివ్యూలతో 20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వసూలు చేయగా.. మొదటి రోజు 70 కోట్ల వరకు నెట్ వసూళ్లు చేసింది. దీంతో ఫస్ట్ రోజు ఓజీకి ఇండియాలో 90 కోట్ల వరకు నెట్ వసూళ్లు దక్కాయి. ఇక ఓవర్సీస్‌లోను అదరగొట్టింది ఓజీ. యుఎస్‌లో కేవలం పెయిడ్ ప్రీమియర్లతో 3 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది. ఇలా మొత్తంగా ఓవర్సీస్‌ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా ఓజీకి 155 కోట్ల వరకు భారీ ఓపెనింగ్స్ వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు లెక్కలు వేశాయి. ఫైనల్‌గా మేకర్స్ కూడా వరల్డ్ వైడ్‌గా 154 కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా అధికారికంగా ప్రకటించారు. దీంతో.. ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ఓజీ నిలిచింది. అలాగే.. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ఓజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ టాప్ 10 ఓపెనర్లలో ఒకటిగా నిలిచింది. మరి లాంగ్ రన్‌లో ఓజీ వసూళ్ల ఊచకోత ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version