NTV Telugu Site icon

Official : భగవంత్ కేసరి రీమేక్ హక్కులు కొనుగోలు చేసిన తమిళ హీరో..

Vijay

Vijay

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ దర్శకుడి అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. అనిల్ రావిపూడి తన జానర్ ను పక్కన పెట్టి మొదటిసారి సరికొత్త కథ, కాదనాలతో బాలయ్యను సెటిల్డ్ గా ప్రెసెంట్ చేసాడు. డాన్స్ డాల్ శ్రీలీల బాలయ్య కూతురుగా నటించింది. ఇటీవల 2024 ఉత్తమ చిత్రంగా సైమా, ఐఫా అవార్డులు సైతం గెలుచుకుంది.

Also Read : Jr.NTR : ఆ తమిళ దర్శకుడి కథకు యంగ్ టైగర్ గ్రీన్ సిగ్నల్ ..?

నిర్మాతలు ఆ జోష్ లో ఉండగానే మరొక గుడ్ న్యూస్ విపించింది. భగవంత్ కేసరి రీమేక్ రైట్స్ ను భారీ ధరకు ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రోడుక్షన్ కొనుగోలు చేసింది. షైన్ స్క్రీన్ నిర్మాత సాహు గారపాటి రీమేక్ డీల్ ను క్లోజ్ చేసారు. అయితే ఈ రీమేక్ ఎవరి కోసమని ఆరా తీయగా తమిళ స్టార్ హీరో విజయ్ కోసమని తెలిసింది. విజయ్ సినీ కెరీర్ లో చివరి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. పలు రకాల కథలు విన్నవిజయ్, భగవంత్ కేసరి కథకు మొగ్గు చూపారని తెలుస్తోంది. తన చివరి సినిమాను హిట్ తో సినీ కెరీర్ ముగించాలని అందుకే ఆల్రెడీ హిట్ అయిన సినిమాను రీమేక్ చేయనున్నారని, విజయ్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి తెరకేక్కిస్తారని సమాచారం .విజయ్ కెరీర్ లో 69వ విజయ్ కు జోడిగా బాలీవుడ్ భామ పూజ హెగ్డే నటిస్తోన్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

 

Show comments