Site icon NTV Telugu

Odela 2: రిలీజ్ కు ముందే గట్టి సౌండ్ చేస్తున్న ఓదెల 2

Odela 2

Odela 2

తమన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం “ఓదెల 2”. కరోనా సమయంలో ఓటీటీలో రిలీజైన “ఓదెల రైల్వే స్టేషన్” చిత్రానికి ఇది సీక్వెల్. అశోక్ తేజ దర్శకుడిగా, సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని మధు అనే కొత్త నిర్మాత నిర్మిస్తున్నారు. మొదటి భాగంలో, తన భర్త ఊరిలోని ఆడవాళ్లను చంపుతున్న విషయం తెలుసుకున్న హెబ్బా పటేల్, అతని తల నరికి చంపేస్తుంది. ఆ తర్వాత ఆమె జైలుకు వెళ్తుంది. అయితే, తల నరికి చంపబడిన తిరుపతి (వశిష్ట) ఆత్మగా మారి, ఊరిలోని అందరినీ ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాడు. ఈ ఆత్మను కట్టడి చేసేందుకు హెబ్బా పటేల్ సోదరి అయిన తమన్నా ఎంట్రీ ఇస్తుంది. చిన్నప్పుడే ఇంటిని వదిలి అఘోరాగా మారిన తమన్నా, తిరుపతి ఆత్మను కట్టడి చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందించబడింది.

Niranjan Reddy: మోసపోయా.. ఛాంబర్ ముందుకు హనుమాన్ నిర్మాత!

ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్ అయింది, అలాగే మంచి థియేట్రికల్ రైట్స్ కూడా సాధించింది. ఒక రకంగా, టేబుల్ ప్రాఫిట్‌తో సినిమా రిలీజ్ అవుతోంది. సినిమాపై రిలీజ్‌కు ముందు నుంచే అంచనాలు నెలకొన్నాయి. వీఎఫ్‌ఎక్స్, ప్రమోషనల్ కంటెంట్‌లో మంచిగా కనిపిస్తుండటంతో, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని యూనిట్ నమ్ముతోంది. ఈ మధ్యకాలంలో వరుస హిట్లతో తమన్నా జోష్‌లో ఉంది. అలాగే, సీక్వెల్ అడ్వాంటేజ్ కూడా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెడుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. సాధారణంగా శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలకు భిన్నంగా, ఈ చిత్రం గురువారమే రిలీజ్ కాబోతోంది, ఇది కూడా సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద, సినిమాపై మంచి బజ్ ఉండటంతో, ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నిర్మాణ బృందం ఆశిస్తోంది.

Exit mobile version