Site icon NTV Telugu

మరో మైలు స్టోన్ ను అందుకున్న ఎన్టీఆర్

NTR Reaches 5 Million Mark On Twitter

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీ అభిమానగణం ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతుందంటే నందమూరి అభిమానుల హడావుడి మాములుగా ఉండదు. అయితే సోషల్ మీడియాలోనూ విశేషంగా ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. తాజాగా ఆయన సోషల్ మీడియాలో మరో మైలు స్టోన్ ను అందుకున్నారు. నిన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా… ఒకేరోజు తారక్ ను దాదాపు 2 వేల మంది ఫాలో కావడం విశేషం. దీంతో ట్విట్టర్ ఖాతాలో తారక్ అభిమానుల సంఖ్య 5 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #5MFollowersForNTR అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇప్పుడు సౌత్ లో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న అతికొద్దిమంది స్టార్స్ లో ఒకరిగా తారక్ చేరిపోయాడు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం చరణ్ తో కలిసి “ఆర్ఆర్ఆర్” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కొరటాలతో కలిసి “ఎన్టీఆర్30”, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “ఎన్టీఆర్31” చిత్రాల్లో నటించనున్నారు.

Exit mobile version