NTV Telugu Site icon

NTR NEEL: ‘ఎన్టీఆర్’ డ్రాగన్ ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ

New Project

New Project

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కెరియర్ లో 31వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఈమధ్య ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ కూడా ఈ మధ్యనే మొదలైంది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ లేకుండానే షూట్ జరుగుతున్నా త్వరలోనే ఆయన కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. పిరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి సినిమా నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే తమిళ సినిమాని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ సినిమా సక్సెస్ మీట్ కి హాజరైన రవిశంకర్ ఎన్టీఆర్ డ్రాగన్ గురించి మాట్లాడారు.

Rajamouli: రాజమౌళికి కొత్త కష్టం ?

ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన సినిమా స్క్రిప్ట్ గురించి మాట్లాడుతూ ఇది ఇండియన్ సినిమా కాదని ఇంటర్నేషనల్ సినిమా అని అని చెప్పుకొచ్చారు. భారీ కాన్వాస్ లో ఈ సినిమా గ్రాండ్గా తెరకెక్కిస్తున్నామని అన్నారు. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు. జనవరి 9 2026లో సినిమాను ఎట్టి పరిస్థితులలో రిలీజ్ చేసేందుకు టీం కష్టపడుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది కానీ ఆ విషయం మీద అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని ఇంటర్నేషనల్ స్థాయిలో రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరుగుతున్నాయి.