NTV Telugu Site icon

NTR Neel: ప్రశాంత్ నీల్ డ్యూటీ ఎక్కేశాడు!

Prashanth Neel

Prashanth Neel

ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక ఈరోజు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లుగా సినిమా టీంతో పాటు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సోషల్ మీడియా వేదికగా నిర్ధారించారు. నిజానికి ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ స్టైల్ ఎలివేషన్స్ లో చూద్దామని అభిమానులతో పాటు సినీ ప్రేమికుల సైతం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Megastar : విమానంలో పెళ్లి రోజు వేడుకలు.. ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

ఇక ఈరోజు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక భారీ ఎపిసోడ్ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ నటించడం లేదు కానీ వచ్చే షెడ్యూల్లో ఆయన జాయిన్ కాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో కూడా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఒకరకంగా సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకులు ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు సిద్ధం చేస్తున్నారు. కేజిఎఫ్ సిరీస్ తర్వాత సలార్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమాని కళ్యాణ్ రామ్, నవీన్, రవిశంకర్,ని హరికృష్ణ కొసరాజు మైత్రి మూవీ మేకర్స్ -ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.