Site icon NTV Telugu

Jr NTR: ఎన్టీఆర్ పునుగులు వేస్తే లొట్టలేసుకుంటూ తినాల్సిందే

Jr Ntr

Jr Ntr

జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్ కేవలం ఒక టాప్ స్టార్ మాత్రమేకాదు ఒక అసాధారణమైన డ్యాన్సర్. అందరినీ మంత్ర ముగ్ధులను చేసేలా మాట్లాడగలడు. అంతేమంచిగా పాటలు కూడా పాడగలడు. అయితే మనోడు చేయు తిరిగిన వంటగాడు కూడా అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇటీవల ఎస్క్వైర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఎన్టీఆర్ తాను ప్రొఫెషనల్ చెఫ్ లాగా వంట చేస్తానని వెల్లడించాడు. అయితే ఆయన వంట తినే అదృష్టం భార్య ప్రణతి, సన్నిహితులకు మాత్రమే.

Also Read: Dhanush: ధనుష్ ప్రేమలో మృణాళ్..ఇదిగో ప్రూఫ్?

ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌లతో బిజీగా లేకుండా రిలాక్స్డ్ మూడ్‌లో ఉన్నప్పుడు, పునుగులు (ఆంధ్రా స్పెషల్) అలాగే బిర్యానీ తయారు చేయడానికి ఇష్టపడతాడట. “నేను వాటిని నా భార్య ప్రణతి, కొంతమంది సన్నిహితుల కోసం మాత్రమే చేస్తాను” అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాపై తన అభిప్రాయాలను కూడా ఆయన ప్రస్తావించారు. హిందీ, తెలుగు చిత్రాల మధ్య తనకు తేడా లేదని అన్నారు. “నన్ను నేను ఒక భారతీయ నటుడిగా భావిస్తా, ప్రతి భాషా చిత్రాన్ని భారతీయ చిత్రంగా భావిస్తాను” అని ఆయన అన్నారు.

Exit mobile version