Site icon NTV Telugu

NTR : అదుర్స్ 2 అంటే భయం వేస్తుంది..

Adhurs2

Adhurs2

ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఆయన చేసిన ‘అదుర్స్’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలిసిందే. 2010లో వి వి వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తారక్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి కామెడీ రోల్‌, మరోటి సీరియస్‌ రోల్‌. చారిగా ఆయన చేసిన రచ్చ వేరే లెవల్‌ అని చేప్పోచ్చు. ముఖ్యంగా బట్టు‌గా బ్రహ్మానందం చేసిన కామోడి ఈ మూవీ‌ని మరింత విజయవంతం చేసింది. ఇప్పటికి కూడా ‘అదుర్స్’ వస్తుంది అంటే కొత్త మూవీ గా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. అయితే కొద్ది రోజుల క్రితం ‘అదుర్స్ 2’ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు అప్‌ డేట్‌ లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీపై స్పందించారు ఎన్టీఆర్‌.

Also Read: Coolie Movie : విడుదలకు ముందే చరిత్ర సృష్టించిన రజినీకాంత్ ‘కూలీ’

తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకున్నాడు. ‘దేవర 2’ తప్పకుండా ఉంటుందని.. ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ‘NTR Neel’ మూవీ కారణంగా లైనప్‌లో మార్పులు జరిగాయని తెలిపారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో కూడా ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు హింట్ ఇచ్చారు. అలాగే ‘అదుర్స్ 2’ సినిమా గురించి కూడా మాట్లాడుతూ.. ‘ఒక యాక్టర్‌కి కామెడీ పండించడం చాలా కష్టమైన పని. దానికి భయపడే నేను ‘అదుర్స్‌ 2’ చేయట్లేదు. మళ్ళీ ఆ కామెడీ వస్తుందో లేదో అని భయం. మ్యాడ్ 1లో రామ్ నితిన్ యంగ్‌గా ఉన్నాడు, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాడు. కెమెరా ముందు నిల్చోవడం అంత ఈజీ కాదు. మ్యాడ్ లో రామ్ నితిన్ అద్భుతంగా నటించారు. కామెడీ పలికించడం యాక్టర్‌కి చాలా కష్టం. అందుకే నేను ‘అదుర్స్ 2’ చేయడానికి ఆలోచిస్తున్నాను’ అని తెలిపారు. ఇలా ‘మ్యాడ్ స్క్వేర్’ ఈవెంట్ ద్వారా చాలా రోజుల తర్వాత అభిమానులతో ముచ్చటించిన తారక్.. తాను నటించబోయే సినిమాల గురించి ఫుల్ అప్డేట్స్ ఇవ్వడంతో అందరూ ఖుషీ అవుతున్నారు.

Exit mobile version