ఎన్టీ రామారావు.. ఈ పేరుకు ఓ చరిత్ర ఉంది.. కాదు కాదు ఈ పేరుతోనే ఓ చరిత్ర రాయొచ్చు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ అపురూపమైన గ్రంథాన్ని లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకోని వారంటూ ఉండరు. 1951లో విడుదలైన పాతాళ భైరవి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయిన తొలి తెలుగు సినిమా. అప్పట్లో “వంద రోజులు” పూర్తి చేసుకున్న సినిమా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే తాజాగా రామారావు గురించి ‘అన్న ఎన్టీఆర్’ యూ ట్యూబ్ ఛానల్‌తో సీనియర్ నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Also Read : Sonu Nigam: సోనూనిగమ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు!
‘దర్శకుడు కేవీరెడ్డి గారిని ఎన్టీఆర్ గురువుగా భావించేవారు. గౌరవించేవారు. ఎన్టీఆర్ గారి ఇంట్లో ఒక కుర్చీ ఉండేది… అది కేవీరెడ్డి గారి కోసమే వేయించేవారు. ఆ కుర్చీలో కేవీ రెడ్డిగారు తప్ప వేరొకరు కూర్చున్నది లేదు. ఇప్పటికీ ఆ కుర్చీ అలానే ఉంది. కేవీ రెడ్డి చాలా బాధ్యత గల మనిషి. ‘దొంగరాముడు’ సినిమాను 6 లక్షలలో ఇస్తానని ఆయన నిర్మాతలతో చెప్పారు. కానీ సినిమా పూర్తయ్యేసరికి 6 లక్షల పాతికవేల ఖర్చు అయింది. పైన పాతికవేలు కేవీ రెడ్డి గారు భరించడం ఆయన నిజాయితీకి నిదర్శనం. ఆ సినిమాకు ఆయన పారితోషికం లక్ష రూపాయలైతే, అక్కినేని తీసుకున్నది కేవలం రూ.20 వేలు మాత్రమే. ఆ రోజుల్లో దర్శకుడిగా ఆయనకు గల డిమాండ్ అలాంటిది. ఒకానొక సమయంలో కేవీరెడ్డి గారితో సినిమాలు నిర్మించడానికి, నిర్మాతలు ఆలోచన చేశారు. అలాంటి టైంలో కూడా తన సొంత బ్యానర్లో కేవీ రెడ్డి గారి తో సినిమా చేయడానికి సిద్ధపడ్డాడు ఎన్టీఆర్. తన వయసు సహకరించదేమోనని కేవీ రెడ్డి అన్న కూడా తాను హెల్ప్ చేస్తూ ఉంటానంటూ ఆయనను ఎన్టీఆర్ ఉత్సాహపరిచారు’ అంటూ చెప్పుకొచ్చారు. అప్పటి విషయాలు ఇలా ఇప్పుడు పంచుకొవడంతో. ప్రజంట్ నిర్మాత ప్రసన్న కుమార్ మాటలు వైరల్ అవుతున్నాయి.
