నందమూరి తారక రామారావు నటించిన తొలి చిత్రం ‘మనదేశం’. నేటికి ఈ సినిమా విడుదల అయి సరిగ్గా 75 సంవత్సరాలు. నాడు ఎన్టీఆర్ గా వెండితెరకుపరిచయమై నేడు యుగపురుషునిగా తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్తానం సంపాదించుకున్నారు రామారావు. తెలుగు సినిమా కళామాతల్లి ముద్దు బిడ్డగా సినీ పరిశ్రమ ఉన్నంత కాలం ఎన్టీఆర్ కీర్తి అజరామరంగా వెలుగుతూనే ఉంటుంది. అయన వారసునిగా వెండితెరకు పరిచయమయిన నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం 50ఏళ్లు పూర్తీ చేసుకున్నారు.
Also Read : NTR 75: తారక రాముని సినీ ప్రయాణానికి 75 వసంతాలు
ఈ నేపథ్యంలో బాలయ్య తన ఫేస్ బుక్ పేజ్ లో తండ్రిని స్మరించుకుంటూ “నేను అనునిత్యం స్మరించే పేరు..నా గురు, దైవం, స్ఫూర్తి మా నాన్న ఎన్టీఆర్ గారు వెండితెరపై ‘మన దేశం’ చిత్రంతో దర్శనమిచ్చి ఈ నవంబర్ 24వ తేదీతో 75 సంవత్సరాలు పూర్తిచేసుకొని ‘వజ్రోత్సవం’ జరుపుకుంటున్న ఈ సంవత్సరమే, హీరోగా నేను 50 ఏళ్ళు నిర్విరామంగా, దిగ్విజయంగా పూర్తి చేసుకొని కళమతల్లి సేవలో.. ‘స్వర్ణోత్సవం’ జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాన్న గారి నుంచి నన్ను, నా కుటుంబ సభ్యులను ఆదరిస్తున్న నా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్ళకు, నా సినీ ప్రయాణంలో నాకు అడుగడుగునా సహకరించిన తోటి కళాకారులకు, దర్శకనిర్మాతలకు, సాంకేతికనిపుణులకు , పంపిణీదారులకు, థియోటర్స్ యాజమాన్యం & సిబ్బందికి , ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియాకి , అన్ని విభాగాల సినీ కార్మికులకు, నా ఉన్నతిని కోరే ఆత్మీయ శ్రేయోభిలాషులందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను- మీ నందమూరి బాలకృష్ణ ” అని పోస్ట్ చేసారు. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కల సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ