Site icon NTV Telugu

November 7 Telugu Movie Releases: నవంబర్ 7.. రిలీజ్’కి క్యూ కట్టిన సినిమాల లిస్ట్ ఇదే

Tollywood

Tollywood

నవంబర్ ఏడో తారీఖున చిన్నా, చితకా సినిమాలు సహా కొన్ని పెద్ద సినిమాలు సైతం రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. వాస్తవానికి నవంబర్ 7వ తేదీన అనూహ్యంగా చాలా సినిమాలు రిలీజ్‌కి రెడీ అవ్వడం గమనార్హం. ఈ నవంబర్ ఏడో తేదీన చెప్పుకోదగ్గ సినిమాలు అంటే రష్మిక హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ తో పాటు సుధీర్ బాబు హీరోగా నటించిన ‘జటాధర’ సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు కాకుండా తిరువీర్ హీరోగా నటించిన ‘ప్రీవింగ్ షో’ తో పాటు విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘ఆర్యన్’ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది.

Also Read:Sai Dharam Tej: వాటితో సెల్ఫీ దిగాలి..అదే అసలు విజయం

ఇక ఈ సినిమాలతో పాటు సడన్‌గా విజయ్ సేతుపతి కుమారుడు హీరోగా నటించిన ‘ఫినిక్స్’ సినిమా కూడా నవంబర్ 7వ తేదీనే తెలుగులో రిలీజ్‌కి రెడీ అయింది. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా నటించిన ఒక మలయాళ హారర్ సినిమా ‘డయాస్ ఇరాయి’ కూడా నవంబర్ ఏడో తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి ఈ సినిమాకి మలయాళంలో మంచి హిట్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాలతో పాటు ఒక బాల నటుడు హీరోగా నటిస్తున్న ‘ప్రేమిస్తున్న’ అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘ఆర్ఎక్స్ 100’, ‘బేబీ’ లాంటి కంటెంట్‌తో వస్తున్నామంటూ గట్టిగా మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలతో పాటు ‘వృషభ’, ‘హరికథ’ అనే మరో రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే వీటికి పెద్దగా ప్రమోషన్ ఏమీ చేయడం లేదు మేకర్స్.

Exit mobile version