Sara Tendulkar Wedding Rumours: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల కుమార్తె సారా టెండూల్కర్ పేరు నిత్యం వార్తల్లో ఉంటుంది. ముఖ్యంగా ఆమె ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సారా డేటింగ్‌లో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా సారా పెళ్లిపై మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ చిన్న కుమారుడు, యువ నటుడు రాజ్‌వీర్ డియోల్‌తో సారా టెండూల్కర్ వివాహం జరగబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సన్నీ డియోల్ టీమ్‌కు చెందిన అత్యంత సన్నిహితుల సమాచారం ప్రకారం.. ఓ పార్టీలో రాజ్‌వీర్, సారా తొలిసారి కలుసుకున్నారని.. ఆ పరిచయం తర్వాత ఇరు కుటుంబాల మధ్య పెళ్లి ప్రస్తావన వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. 30 ఏళ్ల సారా, 32 ఏళ్ల రాజ్‌వీర్ 2027లో పెళ్లి చేసుకోబోతున్నారట. రాజ్‌వీర్ 2023లో వచ్చిన హిందీ రొమాంటిక్ డ్రామా ‘డోనో’తో హీరోగా అరంగేట్రం చేశాడు.
ఈ వార్త నిజమైతే భారతీయ క్రికెట్, బాలీవుడ్ రంగాలకు చెందిన రెండు ప్రముఖ కుటుంబాలు ఒక్కటి అయినట్లే. ఒకవైపు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుటుంబం.. మరోవైపు బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సన్నీ డియోల్ కుటుంబం కావడంతో ఈ ప్రచారం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అయితే ఈ పెళ్లి వార్తలపై అటు సచిన్ కుటుంబం కానీ.. ఇటు సన్నీ డియోల్ కుటుంబం కానీ ఇప్పటివరకు స్పందించలేదు. మరి ఈ ప్రచారంలో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

