NTV Telugu Site icon

Committee Kurrollu : కమిటీ కుర్రోళ్ళు కాదు కలెక్షన్స్ కుర్రోళ్ళు..

Untitled Design (32)

Untitled Design (32)

డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంద‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఆడియెన్స్‌, విమ‌ర్శ‌కుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీ నుంచి అభినంద‌న‌లు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జోరు చూపిస్తోంది. ఇప్ప‌టికే సినిమా అన్నీ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలోకి పయనిస్తోంది.

Also Read: Nani: నేచురల్ స్టార్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న శనివారం ‘రన్ టైమ్’.

కంటెంట్ ఉన్నోడికి క‌టౌట్ చాల‌నే డైలాగ్ త‌ర‌హాలో మంచి క‌థ‌తో చేసిన సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో నిహారిక అండ్ టీమ్ క‌మిటీ కుర్రోళ్ళు సినిమాను ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చింది. రోజు రోజుకీ ఆద‌ర‌ణ‌తో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌ను కూడా పెంచుకోవ‌టంలో క‌మిటీ కుర్రోళ్ళు స‌క్సెస్ అయ్యారు. సినిమా విజ‌య‌వంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టేసింది. రెండో వారం కంటే మూడో వారంలో సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుండ‌టం విశేషం. ఇప్పటివరకు ఈ చిత్రం రూ. 17.76 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకుంటోందీ చిత్రం. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ దక్కించుకుంది.