Site icon NTV Telugu

షూటింగ్ లో గాయపడ్డ నటి

బాలీవుడ్‌ బ్యూటీ నోరా ఫతేహీ షూటింగ్ లో గాయపడింది. “భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా” షూటింగ్‌లో ఓ నటుడు గన్‌ వాడేటప్పుడు ప్రమాదవశాత్తూ అది నోరా ముఖానికి తగిలడంతో రక్తం కారింది. ఈ యాక్షన్‌ సన్నివేశంలో ఆమె డూప్‌ లేకుండా చేయడంతో గాయాలు అయ్యాయి. అయితే తన గాయాన్ని అలాగే భరిస్తూ కారుతున్న రక్తంతోనే షూటింగ్‌లో పాల్గొందట. దీంతో ఆ సీన్‌ మేకప్ లేకుండానే చాలా సహజంగా వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ యాక్షన్‌ సన్నివేశాన్ని తన జీవితంలో ఎప్పటికి మర్చిపోలేనని పేర్కొంది. ఈ చిత్రం ఆగస్టు 13న హాట్‌ స్టార్‌లో విడుదల కానుంది.

Exit mobile version