Site icon NTV Telugu

కారు కథనాలపై సోనూసూద్ స్పందన

నటుడు సోనూసూద్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరికీ తన వంతు సాయం అందిస్తూ రియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో సోనూసూద్ పై వార్తలు కూడా ఎక్కువైపోయాయి. అయితే తాజాగా సోనూ తన పెద్ద కుమారుడు ఇషాన్‌కి రూ.3 కోట్లు పెట్టి అత్యంత ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చారంటూ గత కొన్నిరోజులుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించాడు. ఇషాన్‌కి కారు కొనుగోలు చేసి బహుమతిగా కూడా ఇవ్వలేదని చెప్పాడు. ట్రయల్స్‌ కోసం మాత్రమే దానిని ఇంటికి తీసుకువచ్చామని. నా భార్య, పిల్లల్తో కలిసి టెస్ట్‌ రన్‌కు వెళ్లాను, అంతేకానీ మేము దానిని కొనుగోలు చేయలేదని తెలియజేశాడు.

Exit mobile version