కన్నడ బడా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహా’. అశ్విన్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎటువంటి అంచాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ తో ఒక్కసారిగా ఊపందుకున్న ఈ సినిమా కలెక్షన్స్ లో రికార్డులు బద్దులు కొడుతూ వెళ్తోంది. రిలీజ్ అయిన కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 79 కోట్లు రాబట్టిందని తెలుపుతూ నిర్మాణసంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది.
Also Read : Jr. NTR : దేవర 2 షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్
ఇటు తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన గీత ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేయగా బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధిస్తూ రన్ అవుతోంది. తెలుగులో లేటెస్ట్ గా రిలీజ్ అయిన కింగ్డమ్ వంటి స్ట్రయిట్ సినిమాను మించి వసూళ్లు రాబడుతొంది మహావతార్ నరసింహా’. ఈ సందర్భంగా ఈ సినిమా రొరింగ్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు అల్లు అరవింద్. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ” సనాతన ధర్మం గురించి నాకు తెలిసిన వాళ్లలో గాని నా కుటుంభ సభ్యులలో గాని పవన్ కళ్యాణ్ కు తెలిసినంత వెరేవరికీ తెలియదు. సనాతన ధర్మం గురించి పవన్ చెబుతుంటే అందరం మంత్రముగ్ధులం అయిపోతాం. అటువంటి పవన్ కళ్యాణ్ మహావతార్ నరసింహ సినిమా చూడాలి. ఆయన ఈ సినిమా గురించి మాట్లాడాలి అని కోరుకుంటున్నాను’ అని అన్నారు. పవన్ కళ్యాణ్ పై అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
