NTV Telugu Site icon

Pushpa 2: ఏం పర్లేదు ఏం పర్లేదు.. అంతా ఓకే!

Pushpa 2

Pushpa 2

No Issues Between Allu Arjun and Sukumar Says Close Sources: పుష్ప 2 సినిమా షూటింగ్ గురించి పెద్ద ఎత్తున ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రూపుదిద్దుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ పలు కారణాలతో సినిమాని డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. అయితే సుకుమార్ బన్నీ మధ్య విభేదాలు మొదలయ్యాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు విషయం ఏమిటనేది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ ఈనెల 25వ తేదీ నుంచి మొదలు కాబోతోంది. అల్లు అర్జున్ 28వ తేదీ నుంచి జాయిన్ కావాల్సింది. అయితే ఈ షెడ్యూల్లో మొదటి రెండు రోజుల షూటింగ్ సుకుమార్ క్యాన్సిల్ చేశారట.

Pre Launch Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం.. రూ.120 కోట్లకు కుచ్చుటోపీ

ఎందుకంటే ఎడిటింగ్ పూర్తి చేస్తే ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసే విషయంలో ఇబ్బంది ఉండదని ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సుకుమార్ కుమార్తె అమెరికాలో చదువుతున్న నేపథ్యంలో చంద్రబోస్తో కలిసి సుకుమార్ అమెరికాకి వెళ్లారట. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లిరిక్స్ ఆ ట్రిప్ లో పూర్తి చేసేలా చంద్రబోస్ ని కూడా తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఇప్పటికే సుకుమార్ అమెరికా ట్రిప్ పూర్తయింది, ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఎలాంటి ఇబ్బందులు లేవట. పుష్ప 2 సినిమా గురించి అంతా ఓకే అని అంటున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరు ట్రిప్స్ కి వెళ్లడంతో ఇద్దరు మంచే ఏదో విభేదాలు మొదలయ్యాయి అనేలా ప్రచారం జరిగింది. అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదని అంటున్నారు. కచ్చితంగా సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేయడం ఖాయమని పుష్ప 2 సినిమా యూనిట్ కి సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి.

Show comments