మలయాళ సినిమాల్లో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్‌తో బాగా క్రేజ్ సంపాదించిన హీరో నివిన్ పౌలీ. ముఖ్యంగా ‘ప్రేమమ్’ ఇచ్చిన విజయం ఆయనను పాన్-ఇండియన్ లెవెల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కెరీర్ కొంత మందగించింది. వరుస ఫ్లాప్స్ కారణంగా నివిన్ నుంచి మళ్లీ పెద్ద విజయం వస్తుందా? అనే సందేహాలు మొదలయ్యాయి.
Also Read : Sir Madam: ఓటీటీలోకి ‘సార్ మేడమ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
అయితే ఇప్పుడు ఆ అనుమానా లన్నిటికీ చెక్ పెట్టేలా కనిపిస్తుంది. ఆయన తాజా సినిమా ‘డియర్ స్టూడెంట్స్’ టీజర్ లో దర్శకమిచ్చారు. కాగా ఈ టీజర్ సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ టాక్ సంపాదిస్తోంది. ఈ సినిమా ద్వారా నివిన్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీజర్‌లో నివిన్ తన స్వంత రెస్టారెంట్‌లో సరదాగా ఎంటర్‌టైన్ చేస్తూ కనిపిస్తాడు. ఈ సమయంలో అక్కడికి వచ్చే నయనతారతో పరిచయం అవుతుంది. ఏదో దర్యాప్తు కోసం వచ్చిన నయన్ – నివిన్ మధ్య జరిగే సంభాషణ, చివర్లో స్టూడెంట్స్ ఎంట్రీ చూపించడం ద్వారా టైటిల్‌కు అనుగుణంగా మరో ఆసక్తికరమైన ట్రాక్ ఉందని మేకర్స్ సూచించారు.
ఇక ఈ సినిమాలో నివిన్ పౌలీ – నయనతార కాంబినేషన్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కామెడీ టైమింగ్‌లో ఎప్పుడూ బాగానే రాణించే నివిన్, స్టార్ పవర్ కలిగిన నయన్ కలిసి రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తానికి, ‘డియర్ స్టూడెంట్స్’ టీజర్ చూసిన నెటిజన్లు నివిన్ పౌలీ రీ-ఎంట్రీ గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. సినిమా విడుదలైన తర్వాత నిజంగానే ఆయన మళ్లీ తన ఫామ్‌ను రాబట్టగలడా అనే కుతూహలం పెరిగింది.
