Site icon NTV Telugu

Nivetha Thomas: ‘అయ్యో నివేదా.. ఏమైంది నీకు?’.. ఇలా అయిపోయావు ఏంటి?

Nivetha Thomas

Nivetha Thomas

Nivetha Thomas Looks getting Trolled : బాలనటిగా సినిమాలు చేయడం మొదలు పెట్టి మలయాళీలకు సుపరిచితమైన నటి నివేదా థామస్. దృశ్యం తమిళ రీమేక్‌లో కమల్‌హాసన్‌ కూతురుగా నటించిన నివేదా ఇప్పటికే తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో తన సత్తా చాటింది. ఇక నివేదా అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ప్రమోషన్ కార్యక్రమానికి వచ్చినప్పుడు చూపిన లుక్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. నివేదా థామస్ తాజాగా తన రాబోతున్న కొత్త తెలుగు సినిమా ’35 చిన్నకథ కాదు’ ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చింది. ఈ క్రమంలో చీరకట్టులో ఉన్న ఆమెను చూసి అభిమానులు ‘ఇంత లావుగా ఉంది ఏంటి’ అని కామెంట్స్ చేస్తున్నారు. చాలా బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా ఈ వీడియోల కింద కనిపిస్తున్నాయి.

Baburaj: సినీ అవకాశం ఇప్పిస్తానని రేప్ చేశాడు.. నటుడిపై యువతి కేసు!!!

అంత లావు అవసరం లేదు, ఆమె తగ్గాలి అని అంటూ కామెంట్ చేస్తున్నారు. ’35 చిన్నకథ కాదు’ సినిమాలో నివేదా తల్లి పాత్రలో నటిస్తుంది. ఈ పాత్ర పేరు సరస్వతి. ఇక ప్రమోషన్ ఈవెంట్‌లో నివేదా మాట్లాడుతూ.. ఇది తనకు బాగా నచ్చిన కథ అని, పాత్రకు న్యాయం చేశానని నమ్ముతున్నానని చెప్పింది. ’35 చిన్నకథ కాదు’ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. నంద కిషోర్ ఇమాని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గౌతమి, ప్రియదర్శి పులికొండ, భాగ్యరాజ్, విశ్వదేవ్ రాచకొండ, అనన్య, అరుణ్ దేవ్, కృష్ణ తేజ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, సురేష్ ప్రొడక్షన్స్, వాల్టాయిర్ ప్రొడక్షన్స్ పతాకాలపై విశ్వదేవ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి, సృజన్ యరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.

Exit mobile version