టాలీవుడ్ తార నివేథా థామస్ మొదటి సినిమా ‘జెంటిల్ మెన్’ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత వచ్చిన అవకాశాలతో టాలీవుడ్ లో తన మార్క్ అందంతో ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించిన ఆమెకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘శాకిని ఢాకిని’చిత్రంలో రెజీనా కసాండ్రతో కలిసి నటిస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలావుంటే, తాజాగా నివేథా థామస్ గాయనిగా గీటార్ పట్టుకొని పాడిన ఓ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జానే తు యా జానేనా సినిమాలోని ‘కభీ.. కభీ.. అధితీ జిందగీ’ అనే పాట పడుతూ అభిమానులను తన ఎక్స్‌ప్రెషన్స్ తో చంపేసింది. నివేథా పాటలో లీనమై పాడిన తీరు ఆకట్టుకోవడంతో కామెంట్ల వర్షం కురుస్తోంది. అయితే నివేథా గతంలోనూ తనకు నచ్చిన పాటలను పాడేస్తూ తన గాన ప్రతిభను బయటపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్యూట్ టాలెంట్ లోను సినిమాలోనూ చూపించొచ్చుగా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
‘కభీ.. కభీ..’ పాటతో నివేథా థామస్.. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్
