Site icon NTV Telugu

Nitya : మమ్మల్ని ఏదో విధంగా టచ్ చేయాలని చూస్తారు..

Nithya

Nithya

సినిమా రంగంలో చాలా మంది హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ పర్సనల్ లైఫ్‌కి ప్రొఫెషనల్ లైఫ్‌కి చాలానే తేడా చూపిస్తారు. మెయిన్‌గా హీరోయిన్స్ ఆన్ స్క్రీన్‌లో ఉన్నట్టుగా, ఆఫ్ స్క్రీన్‌లో దాదాపు ఉండరు. చాలా వరకు తమ పర్స్‌నల్ స్పేస్‌ని గీత దాటకుండానే ఉంటారు. ముఖ్యంగా బయట జనాలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటారు. అభిమానులకు కూడా దూరంగా ఉంటారు. అయితే ఇటీవల అందాల భామ నిత్య మీనన్ ఓ సినిమా వేడుకకు హాజరైంది. అక్కడ ఓ అభిమాని నిత్యకు షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి ట్రై చేశాడు. కానీ నిత్యామీనన్‌ మాత్రం అతనికి షేక్‌హ్యాండ్‌ ఇవ్వకుండా, నమస్కారం చేసి, ‘నాకు జలుబు చేసింది..’ అని తప్పుకుంది. కానీ డయాస్‌ మీదకు వెళ్లగానే అక్కడున్న హీరోకు హగ్‌ ఇచ్చేసింది.. దీంతో ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ నెటిజన్లు నిత్యామీనన్‌ని ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేశారు. అయితే

Also Read : Vikram Sugumaran : ప్రముక తమిళ దర్శకుడు కన్నుమూత..

తాజాగా ఈ విషయంపై నిత్య రియాక్ట్ అవుతూ నెటిజన్స్‌కి లెప్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసింది.. ‘సినిమా హీరోయిన్లను, సగటు మహిళల్లా చూడడం చాలామంది మగాళ్లకు తెలీదు. హీరోయిన్లంటే ఈజీగా టచ్‌ చేయొచ్చని అనుకుంటారు. సాధారణ మహిళలను ఎందుకు షేక్‌హ్యాండ్‌ అడగరు? మమ్మల్నే ఎందుకు అడుగుతారు? ఈజీగా ముట్టుకోడానికి. మీకు హీరోయిన్లే మైనా ఆట బొమ్మలా? ఎవ్వరి ఇబ్బుదులు వారికి ఉంటాయి ’ అంటూ ఫైర్‌ అయ్యింది నిత్యామీనన్‌.

Exit mobile version