యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది చెక్, రంగ్ దే అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. “చెక్” చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించగా, ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. “చెక్”లో తప్పుడు ఆరోపణలతో ఉగ్రవాదిగా నిరూపితమైన ఆదిత్యకు మరణశిక్ష ఖరారవుతుంది. అయితే ఆదిత్య జైలులో చెస్ నేర్చుకుంటాడు. ఛాంపియన్ తో ఆడి గెలుస్తాడు కూడా. కానీ అతను కోరుకున్న క్షమాభిక్ష మాత్రం దొరకదు. తనకు పడిన శిక్షణ నుంచి ఆదిత్య ఎలా తప్పించుకున్నాడు ? అనే కథను చూపించారు. ఇటీవల ‘చెక్’ టెలివిజన్ లో ప్రీమియర్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Read Also : తారా సుతారియా బికినీ సెన్సేషన్… బాబోయ్ మామూలు హాట్ కాదు…!
ఈ చిత్రం బుల్లితెరపై ఏకంగా 8.53 టిఆర్‌పిని నమోదు చేసింది. మరో వైపు నితిన్ నటించిన రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ “రంగ్ దే” కూడా ఇటీవలే టీవీలో ప్రదర్శించబడింది. మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి షాకింగ్ గా 7.22 టిఆర్పి మాత్రమే రికార్డ్ అయ్యింది. “రంగ్ దే”లో జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, వెంకి అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. సంగీత స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్. కాగా ప్రస్తుతం నితిన్ “మాస్ట్రో” చిత్రంతో బిజీగా ఉన్నాడు.