అల్లు అర్జున్ దర్శకుడితో నితిన్ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో చెక్ సినిమాతో ఫ్లాప్ అందుకున్న నితిన్ ఆ తరువాత ‘రంగ్ దే’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నితిన్ మాస్ట్రో, అంధాదున్ తెలుగు రీమేక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ప్రాజెక్ట్ ను ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. రచయిత నుంచి దర్శకుడిగా మారిన ప్రముఖ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ తరువాత మూవీ ఉండబోతోందని సమాచారం. అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ ఆ చిత్రంతో భారీ పరాజయాన్ని చవి చూశాడు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నా పేరు సూర్య’ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ దర్శకుడు తాజాగా నితిన్ కు స్క్రిప్ట్ ను వివరించాడట. అంతేకాదు వంశీ ఈ చిత్రంతో హిట్ ను కొట్టడం ఖాయమనే నమ్మకంతో ఉన్నాడట. కరోనా తగ్గిన తరువాత ఈ ఏడాది చివర్లో నితిన్ – వక్కంతం వంశీ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
- Tags
- nithiin
- Vakkantham Vamshi
తాజావార్తలు
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
-
Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
-
Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
-
Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!