Site icon NTV Telugu

Thammudu : తమ్ముడు ఓవర్శీస్ రివ్యూ..

Thammudu

Thammudu

నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న అనగా నేడు “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. ఓవర్సీస్ లో ఒకరోజు ముందుగా ప్రీమియర్ తో రిలీజ్ అయింది. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న నితిన్ కు తమ్ముడు హిట్ ఇచ్చాడో లేదో ఓవర్సీస్ రిపోర్ట్ చూద్దాం

తమ్ముడు అనగానే ఇదేదో సిస్టర్ సెంటిమెంట్ సినిమా అనుకోవడం కామన్.  కానీ సినిమా చూసే టపుడు తెలుస్తుంది ఇది ఎదో క్రైమ్ థ్రిల్లర్ అని.  సిస్టర్ సెంటిమెంట్ కథకి దర్శకుడు కొత్తగా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాడు కానీ దానికి తగ్గ కథ, కథనం కూడా ఉండాలి. ఇక్కడ అదే లోపించింది. ఎమోషనల్ కెనెక్టీవిటి ఉండదు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ గా ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో కూడా చెప్పుకోవడానికి ఏమి లేదు. అంబరగొడుగు నుండి ఎస్కెప్ అవడం ప్రధాన అంశం. కానీ దాన్ని కూడా సైరన విధానంలో ప్రజెంట్ చేయలేదు. నితిన్ చేయడానికి ఏమి లేదు.  హీరోయిన్ సప్తమి గౌడ కాస్త ఇబ్బంది పెట్టింది. దర్శకుడు వేణు శ్రీరామ్ ఫ్యామిలీ డ్రామాలో యాక్షన్-అడ్వెంచర్ చేయాలనీ ఫారెస్ట్ సెటప్ పెట్టి ఎదో చేసేయాలని ఇంకేదో తీసినట్టు అనిపిస్తుంది. అజనీష్ లోకానాధ్ బీజీమ్ పర్లేదు. VFX అక్కడక్కడా నాసిరకంగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. నితిన్ ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన సినిమాలో నితిన్ కూడా ఏమి చేయలేక పోయాడు. కథ అలాంటింది. తమ్ముడుకూడా నితిన్ ను కాపాడాలేకపోయాడు అని టాక్ ఓవర్సీస్ ఆడియెన్స్ నుండి అందుతోంది.

Exit mobile version