మెగా హీరో రామ్ చరణ్ నిర్మాణంలో, హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ది ఇండియా హౌస్’. తాజాగా ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో వేసిన భారీ సెట్‌లో, నిన్న రాత్రి జరిగింది. మూవీలో సముద్రపు సన్నివేశాల చిత్రీకరణ కొరకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు సెట్‌లోకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో పలువురు సినిమా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి.. దీంతో వారిని వెంటనే హాస్పటల్‌కి పంపించారు. అయితే, తాజాగా ఈ సంఘటన పై హీరో నిఖిల్ స్పందించాడు..
Also Read : Nagavamsi : ఇట్స్ అఫీషియల్.. త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలివే..
‘ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇవ్వాలనే ప్రయత్నంలో, కొన్నిసార్లు రిస్క్‌లు తప్పవు. అలాంటి ఓ క్లిష్టమైన షాట్ తీస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. కానీ మా టీం సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. దురదృష్టవశాత్తూ కొన్ని ఖరీదైన పరికరాలను కోల్పోయాం. కానీ దేవుడి దయ వల్ల ఎవరూ గాయలు మాత్రమే అయ్యాయి అందరం క్షేమంగా ఉన్నాం’ అని తెలిపారు నిఖిల్.
