Site icon NTV Telugu

Saarangadariya Trailer: మందు, సిగరెట్, పేకాట, బెట్టింగ్‌ల కంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్!

Sarangadaria Trailer

Sarangadaria Trailer

Nikhil Launches Raja Raveendar Starrer ‘Saarangadariya’ Trailer : రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘సారంగదరియా’. ఈ సినిమాను జూలై 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న క్రమంలో ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో నిఖిల్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌, లెజెండ్రీ సింగర్ కె.ఎస్‌.చిత్ర‌ పాడిన ‘అందుకోవా’, ‘నా కన్నులే..’, ‘ఈ జీవితమంటే..’ అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ కట్ చూస్తే ‘కులం అంటే రక్తం కాదు.. పుట్టుకతో రావడానికి.. మనం చేసే పనే కులం’.., ‘మందు, సిగరెట్, పేకాట, బెట్టింగ్‌లకంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్.. అది మనకు తెలియకుండానే మనం రాజీ పడి బతికేలా చేస్తుంది..

Darshan: దర్శన్ కు తొలగని కష్టాలు.. అప్పటి దాకా జైల్లోనే?

నువ్వింతే.. ఇంతకు మించి ఏం చేయలేవని చెప్పి బాస్ అయి కూర్చుంటుంది’.. ‘ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం.. కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది’ అనే డైలాగ్స్ సినిమాలోని కథ, పాత్రల లోతుని చూపిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే ఫ్యామిలీ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ కష్టాలను చూపించినట్టుగా అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో రాజా రవీంద్ర నటనను చూస్తే అందరినీ కదిలించేలా ఉంది. ఓ మిడిల్ క్లాస్ ఫాదర్, గొప్ప ఉపాధ్యాయుడిగా కనిపించినట్టు అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే పాటలు, ఆర్ఆర్ కూడా బాగున్నాయి. వినయ్ రాసిన డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. రాజా రవీంద్ర తో కలిసి శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహ‌మ‌ద్‌ ,మోహిత్ పేడాడ‌, నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version