Site icon NTV Telugu

Niharika : జలపాతం వద్ద..‘అమ్మా క్షమించు’ అంటూ నిహారిక వైరల్ క్లిప్..

Niharika

Niharika

మెగా ఫ్యామిలీ కూతురు నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. మొదటగా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్ని, యూత్‌లో ఫేమస్ అయి, ఆ తర్వాత యాంకర్‌గా కూడా బుల్లితెరపై ప్రేక్షకుల మనసు దోచుకుంది. యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి చేసిన ‘‘ఒక మనసు’’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టి, ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అనంతరం కొన్ని చిత్రాల్లో నటించగా పెద్దగా సక్సెస్ రాలేదు. అయితే, నటిగా ఆశించిన స్థాయి రాకపోయినా, నిర్మాతగా మాత్రం మంచి పేరు సంపాదించుకుంది. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పేరుతో స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి, వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మిస్తోంది. ఇక..

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండపై.. ట్రోల్స్‌కి కారణం ఇదా ?

కెరీర్‌లో ఎంత బీజిగా ఉన్నప్పటికి, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది నిహారిక, తరచూ తన ట్రిప్స్, వ్యక్తిగత క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. జలపాతం వద్ద తడుస్తున్న వీడియోకి ఆమె ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంది.. “మా అమ్మ నేను క్షేమంగా రావాలని ప్రార్థనలు చేస్తుంటే.. నేనేమో జలపాతం వద్ద తడుస్తున్నా.. సారీ అమ్మ” అని రాసింది. ఈ పోస్ట్‌పై ఆమె వదిన, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నవ్వుతున్న ఎమోజీతో స్పందించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే, వ్యక్తిగతంగా నిహారిక జీవితంలో ఎత్తుపల్లాలు ఎదురైనా విషయం తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న ఆమె, మూడేళ్లలోనే విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తల్లిదండ్రులతో ఉంటూ మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెడుతోంది. ఇప్పుడు నటనతో పాటు నిర్మాతగా కూడా బిజీగా ఉంటే, తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుంది.

 

Exit mobile version