Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghav Niharika: ప్రముఖ తెలుగు డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్గా ఎదిగిన నిహారిక ఎన్ఎమ్ ప్రేమలో పడిందా? బాలీవుడ్ హ్యాండ్సమ్ నటుడు, ఫేమస్ డ్యాన్సర్ రాఘవ్ జుయల్ తో ఆమె డేటింగ్ చేస్తోందా? అంటే అవుననేలా ఉన్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా పిక్స్. సోమవారం వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని క్లోజ్ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఆ ఫొటోలలో నిహారిక – రాఘవ్ ఒకరినొకరు హగ్ చేసుకుంటూ ఎంతో ప్రేమగా, చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాయి. ఈ పిక్స్‌కు కేవలం ఒక ‘రెడ్ హార్ట్’, ‘స్టార్’ ఎమోజీలను మాత్రమే క్యాప్షన్‌గా పెట్టారు. దీంతో వీరిద్దరూ తమ ప్రేమను అఫీషియల్‌గా ప్రకటించేశారంటూ వారి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఈ పోస్ట్‌పై ప్రముఖ రాపర్ రఫ్తార్ స్పందిస్తూ.. “జే బాత్ లాడ్లే” (అది సంగతి తమ్ముడూ) అంటూ దిష్టి చుక్కల ఎమోజీలను పెట్టాడు. అలాగే స్టార్ కంటెంట్ క్రియేటర్ ఆశిష్ చంచలాని కూడా ఈ జోడీకి దిష్టి తగలకుండా ఎమోజీలను షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు “ఓ మై గాడ్.. ఇది నిజంగా ఊహించలేదు”, “సినిమా ప్రమోషన్ కోసం కాకుండా ఇది నిజమైన ప్రేమే కావాలని కోరుకుంటున్నాం” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గతంలో రాఘవ్ జుయల్.. నటి షెహనాజ్ గిల్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చినా, దానిపై వారు ఎప్పుడూ స్పందించలేదు. అయితే ఈ ఫొటోల వెనుక ఒక బిగ్ బిజినెస్ ట్విస్ట్ కూడా ఉందనే అనుమానాలను కొందు నెట్టిజన్లు వ్యక్తం చేస్తున్నారు. రాఘవ్ జుయల్, నిహారిక ఎన్ఎమ్ త్వరలోనే ‘భాయ్ తేరా స్టార్ హై’ (Bhai Tera Star Hai) అనే బాలీవుడ్ సినిమాలో కలిసి నటిస్తున్నారని సమాచారం. వివేక్ బి అగర్వాల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సంజయ్ కపూర్, బర్ఖా సింగ్ వంటి తారలు కూడా భాగం కాబోతున్నారట. దీంతో, ఈ క్రేజీ ఫొటోలు నిజమైన ప్రేమకు సంకేతమా? లేక త్వరలో రాబోయే సినిమా ప్రమోషన్లలో భాగమా? అనే సస్పెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. దీనిపై వీరిద్దరూ నోరు విప్పితేనే క్లారిటీ రానుంది. డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన రాఘవ్.. ‘కిల్’ (Kill) సినిమాలో విలన్‌గా అద్భుత నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్ ‘ది బార్డ్స్ ఆఫ్ బాలీవుడ్’లో నటించిన ఆయన.. నాని హీరోగా రాబోతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇక తెలుగు పిల్ల నిహారిక గత ఏడాది తమిళ బ్లాక్ కామెడీ ‘పెరుసు’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అలాగే తెలుగులో మిత్రమండలి చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది.
Also Read
తాజావార్తలు
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
One Ticket: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. ఒక్క టికెట్‌పైనే ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్‌లల్లో ప్రయాణం..
-
Allu Arjun: కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైన అల్లు అర్జున్!
-
Bandi Sanjay: బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు..!
-
Trump-Leavitt: ‘ఆమె నా కంటే ఎక్కువగా పిల్లలనే ప్రేమిస్తుంది’.. ట్రంప్ చమత్కారం
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!