నిహారిక కొణిదెల ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమై ఆ చిత్రంలో నటనకు మంచి మార్కులు సాధించింది. ఆ తర్వాత ఒకటి అరా సినిమాలలో ఆలా కనిపించి ఇలా వెళ్ళిపోయింది. ఆ వెంటనే వివాహం కొన్నాళ్లకు ఆ బంధానికి స్వస్తి పలకడం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ప్రస్తుతానికి సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెటింది నిహారిక. నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లు నిర్మించి, పలుసినిమాలకు సమర్పకురాలిగా వ్యవహరిస్తూ అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
కాగా నిహారిక సమర్పణలో ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే చిత్రం నిర్మాణం జరిగింది. అన్ని దగ్గరుండి పర్యవేక్షించి ప్రతిదీ భాద్యతగా తీసుకుని ఈ చిత్రాన్ని తన భుజాలపై మోస్తుంది కొణిదెల వారసురాలు. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు పూర్తి చేసింది నిహారిక. ఈ చిత్ర ట్రైలర్ ను యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఇటీవల విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ దక్కించుకొంది. అందరూ నూతన నటీనటులతో రానున్న కమిటీ కుర్రోళ్ళు థియేట్రికల్ రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి. పొలిమేర 3 నిర్మాత వంశీ నందిపాటి ‘కమిటీ కుర్రోళ్ళు’ రెండు తెలుగు రాష్టాల థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన నేడో రేపో రానుంది.
ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా దర్శకురాలు నందిని రెడ్డి, యంగ్ హీరో ప్రియదర్శి, సంతోష్ శోభన్ తదితర సెలెబ్రిటీలతో ఇంటర్వూలు, చిట్ చాట్ లు వంటివి నిర్వహించి వీలైనంతగా కమిటీ కుర్రోళ్లను ప్రేక్షకుల ద్రుష్టి పడేలా అందరికి తన సినిమా చేరేలా కృషి చేస్తుంది నిహారిక.
Also Read: Double ismart: డబుల్ ఇస్మార్ట్ నైజాం రైట్స్ వరంగల్ శ్రీను చేతికి..?