నిహారిక కొణిదెల ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమై ఆ చిత్రంలో నటనకు మంచి మార్కులు సాధించింది. ఆ తర్వాత ఒకటి అరా సినిమాలలో ఆలా కనిపించి ఇలా వెళ్ళిపోయింది. ఆ వెంటనే వివాహం కొన్నాళ్లకు ఆ బంధానికి స్వస్తి పలకడం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ప్రస్తుతానికి సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెటింది నిహారిక. నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లు నిర్మించి, పలుసినిమాలకు సమర్పకురాలిగా వ్యవహరిస్తూ అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.…