Site icon NTV Telugu

TheRajaSaab : నిధి అగర్వాల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫ్యాన్స్.. వీడియో వైరల్

Nidhi Agarwal

Nidhi Agarwal

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

Also Read : TheRajaSaab : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రాజాసాబ్ ప్రీమియర్స్

తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని లూలూ మాల్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నిర్మాత విశ్వప్రసాద్ తో పాటు దర్శకుడు మారుతీ, ఎస్కెయన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు హీరోయిన్స్ నిధి అగర్వాల్, రిద్ది కుమార్ వచ్చారు. అభిమానుల కోలాహలం మధ్య సెకండ్ సాంగ్ ను లాంచ్ చేసారు. అయితే ఈ వేడుక కాస్త  విమర్శలు పాలైంది. పబ్లిక్ ఈవెంట్ కావడంతో అభిమానులు తాకిడి ఎక్కువై తోపులాట జరిగింది. దాంతో అనుకున్న దానికంటే కాస్త ముందుగానే ఈవెంట్ ను ముగించారు. ఈవెంట్ నుండి తిరిగి వెళ్లే క్రమంలో హీరోయిన్ నిధి అగర్వాలా పట్ల అభిమానులు అసభ్యకరంగా ప్రవర్తించారు. నిధి ఈవెంట్ నుండి కారువద్దకు చేరుకునే టైమ్ లో ఆమెపై చేతులేసి తాకడానికి ప్రయత్నించారు. తనపైకి వచ్చేవారిని నిలువరించలేక నిధి ఇబ్బందిగా ఫీల్ అయింది. కొందరు కావాలనే దురుద్దేశంతోనే నిది అగర్వాల్ ను తాకేందుకు ప్రయత్నించారు. రానురాను అభిమానులు యాక్టర్స్ పట్ల హద్దులు మీరుతూ సివిక్ సెన్స్ మరిచి ప్రవిర్తిస్తూన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియూలో వైరల్ గా మారడంతో అభిమానుల పట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version