పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కథానాయికగా జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. కాగా, నేడు నిధి అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ నుంచి నిధి అగర్వాల్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ కనిపించనుంది. నిండుగా చీరకట్టు, నగలు, నాట్యంతో నిధి పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ గ్లిమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో వస్తున్న ఈ సినిమా 17వ శతాబ్ధపు కథతో వస్తుంది. కోహినూర్ వజ్రం నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
నిధి బర్త్ డే స్పెషల్: ‘హరి హర వీరమల్లు’ నుంచి పోస్టర్ విడుదల
