Site icon NTV Telugu

కోవిడ్ బాధితుల కోసం నిధి ఆర్గనైజేషన్

Nidhhi Agarwal to start organization for Covid Patients

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ అనే స్వచ్చంద సంస్థను ప్రారంభించటానికి సిద్దమైంది. ఇది కోవిడ్ సంబంధిత అన్ని అవసరాలకు ఒక స్టాప్ గా ఉంటుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా వచ్చే ప్రతి అభ్యర్థనను పరిశీలించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు నిధి తెలిపింది. “నేను ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభిస్తున్నాను. దీనిని ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ అని పిలుస్తారు. ఇది ప్రజలు వారి అభ్యర్థనలు తెలిపే వెబ్‌సైట్. వారి అభ్యర్థనల మేరకు నేను వారికి ప్రాథమిక అవసరాలు, మందులు లేదా వారికి అవసరమైన ఏదైనా సహాయం చేయగలను. ఇది ముఖ్యంగా కోవిడ్ కోసం” అని ఆమె చెప్పుకొచ్చారు. 2017 బాలీవుడ్ చిత్రం “మున్నా మైఖేల్”లో వెండితెర అరంగ్రేటం చేసిన నిధి అప్పటి నుండి తమిళ, తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా రాణిస్తోంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version